9 నెలల కాలంలోనే అన్న రమేష్ బాబును అలాగే తల్లి ఇందిరాదేవిని కోల్పోయాడు మహేష్ బాబు. దాంతో మహేష్ బాబు తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. కృష్ణ – ఇందిరాదేవి ల పెద్ద కొడుకు రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కూడా. అయితే ఆ తర్వాత మాత్రం హీరోగా నటించిన చిత్రాలు ఆడకపోవడంతో మళ్ళీ సినిమాల్లో నటించలేదు.
కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మద్యానికి బానిస అయ్యాడు రమేష్ బాబు. అయితే మహేష్ బాబుకు అన్నయ్య రమేష్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. కానీ ఆయన్ని మార్చలేకపోయాడు. దాంతో అతడిని అతడి కుటుంబానికి అండగా ఉండాలని భావించిన మహేష్ తన సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా అన్నయ్య ను చేసాడు. తద్వారా కొంత ఆదాయం సమకూరేలా చేసాడు.
కానీ అనారోగ్యం తీవ్రత ఎక్కువ కావడంతో కాలేయం పూర్తిగా దెబ్బతింది. దాంతో ఈ ఏడాది జనవరి 8 న రమేష్ బాబు మరణించాడు. దురదృష్టం ఏంటంటే అన్నయ్య అంటే అమితమైన ఇష్టమైన మహేష్ బాబు అన్నయ్యను చివరి చూపు స్వయంగా చూడలేకపోయాడు ఎందుకంటే ఆ సమయానికి మహేష్ బాబు కరోనా బారిన పడ్డాడు. దాంతో గుండెలవిసేలా ఏడ్చాడట. అన్నయ్యను కేవలం వాట్సాప్ కాల్ ద్వారా మాత్రమే చూసాడు.
అన్నయ్య రమేష్ బాబు మరణం నుండి కోలుకోకముందే తల్లి ఇందిరాదేవి మరణించడంతో 9 నెలల కాలంలోనే ఇద్దరూ తనకు ఇష్టమైన వాళ్ళని పోగొట్టుకోవడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు మహేష్ బాబు. తల్లి ఇందిరాదేవి అంటే మహేష్ కు చాలా ఇష్టం అలాగే తల్లి ఇందిరాదేవి కి కూడా చిన్న కొడుకు మహేష్ బాబు అంటే చాలా చాలా ఇష్టం. మహేష్ బాలనటుడిగా నటించిన సమయంలోనే తన చిన్న కొడుకు పెద్దయ్యాక స్టార్ హీరో అవుతాడు అంటూ మురిసిపోయేదట. ఇందిరాదేవి మరణించడంతో పలువురు స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలు , ఇతర నటీనటులు కృష్ణ కు అలాగే మహేష్ బాబుకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు.