
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాను అల్లు అర్జున్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కథ మొదటగా సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెప్పాడట సందీప్ రెడ్డి వంగా.
అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అయ్యాక సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబు , ప్రభాస్ , రాంచరణ్ ల కోసం గట్టి ప్రయత్నాలే చేసాడు. మహేష్ బాబుకు ప్రభాస్ కు అలాగే రాంచరణ్ కు అదేపనిగా కథలు చెప్పాడట. వెంటపడ్డాడు కూడా. అయితే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అదే స్పిరిట్ చిత్రం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక చరణ్ మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు దానికి తోడు ఇతర సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో మహేష్ ను కొత్త కోణంలో చూపించి అందరినీ షాక్ అయ్యేలా చేయాలని అనుకున్నాడు కానీ మహేష్ బాబు మాత్రం సందీప్ రెడ్డి వంగా చెప్పిన కథ విని షాక్ అయ్యాడట. నాకు ఇలాంటివి సెట్ కావు అని రిజెక్ట్ చేయడంతో అదే కథను అల్లు అర్జున్ కు చెప్పాడట.
ఇంకేముంది అల్లు అర్జున్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో కూడా పుష్ప చిత్రం మహేష్ బాబు చేయాల్సింది. మహేష్ కోసం ఈ కథ రాసాడు సుకుమార్. అయితే ఇలాంటి పాత్ర నాకు నప్పదు అని చెప్పి తప్పుకున్నాడు కట్ చేస్తే అది అల్లు అర్జున్ చేసాడు. బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు పుష్ప 2 చిత్రం చేస్తున్నాడు. ఆ సెంటిమెంట్ తో సందీప్ రెడ్డి వంగా సినిమాను వెంటనే ఒప్పుకున్నాడట. మహేష్ రిజెక్ట్ చేస్తే బ్లాక్ బస్టర్ కావాల్సిందే అని నమ్ముతున్నాడట అల్లు అర్జున్.