
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రిజెక్ట్ సినిమానే తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ” వారిసు ”. వంశీ పైడిపల్లి ఈ చిత్ర కథను మొదట మహేష్ బాబుకు చెప్పాడు …… మహేష్ కు నచ్చింది కూడా. అయితే కథ మొత్తం అయ్యాక మరోసారి చెప్పమన్నాడట. లైన్ గా తీసుకుంటే బాగానే ఉంది కానీ మొత్తం విన్నాకా మాత్రం మహేష్ కు నచ్చలేదట. దాంతో రిజెక్ట్ చేసాడు.
మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో దీన్ని రాంచరణ్ తో చేయాలని అనుకున్నారట దిల్ రాజు , వంశీ పైడిపల్లి. అయితే చరణ్ – శంకర్ ల కాంబినేషన్ సెట్ కావడంతో చరణ్ కాకుండా అల్లు అర్జున్ లేదంటే ప్రభాస్ తో చేయాలని కూడా అనుకున్నారట. అయితే ప్రభాస్ అలాగే అల్లు అర్జున్ కూడా బిజీగా ఉండటంతో చేసేదిలేక తమిళ హీరో విజయ్ కు చెప్పారట.
లక్కీగా విజయ్ కి ఈ సినిమా కథ నచ్చింది దాంతో నక్క తోక తొక్కామని భావించి వెంటనే షూటింగ్ మొదలు పెట్టారు. అదే వారిసు ……. తెలుగులో వారసుడుగా వస్తోంది. 2023 జనవరి 12 న విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే మహేష్ బాబు తప్పు చేసినట్లు అవుతుంది. ఒకవేళ ప్లాప్ అయితే మహేష్ బాబు మంచి పనే చేసాడని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో తెలియాలంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.