మహేష్ బాబు తన అభిమానులకు శుభవార్త తెలియజేసాడు. సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు కానీ అప్పుడే రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేసాడు. ఇంతకీ మహేష్ బాబు కొత్త సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా …… 28 ఏప్రిల్ 2023 న. అదేంటి …… మహేష్ బాబు కొత్త సినిమా ఏంటి ? అనే కదా ! మీ డౌట్ …….. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్న సినిమా.
అసలు ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ రకరకాల కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈనెలలో సెట్స్ మీదకు వెళుతోంది మహేష్ బాబు 28 వ సినిమా. ఈనెలలో ప్రారంభం కానున్న ఈ సినిమాని నిర్విరామంగా షూటింగ్ చేసి పూర్తి చేయనున్నారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో ఏప్రిల్ 28 న విడుదల చేయనున్నారు.
వేసవిని మరొకరు బ్లాక్ చేయకుండా ముందే డేట్ కూడా ఫిక్స్ చేసారు. దాంతో ఇక మిగతా హీరోలకు ముందు కానీ ఆ తర్వాత కానీ తమ సినిమాలను రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మహేష్ బాబుకు ఇది 28 వ సినిమా కావడం విశేషం. గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అతడు , ఖలేజా చిత్రాలు చేసాడు మహేష్. అతడు వెండితెర మీద అంతగా ప్రభావం చూపించలేదు కానీ బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఖలేజా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాంతో ఇప్పుడు మూడో సినిమాగా వస్తున్న సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. మరి ఆ అంచనాలను మహేష్ 28 అందుకుంటుందా ? లేదా ? అన్నది 2023 ఏప్రిల్ 28 న తేలనుంది.
Breaking News
MAHESH BABU- TRIVIKRAM:మహేష్ బాబు ఫ్యాన్స్ కు శుభవార్త : రిలీజ్ డేట్ వచ్చేసింది
Date: