మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం సడెన్ గా ఆగిపోయిందనే వాదన వినిపిస్తోంది. సెప్టెంబర్ 13 న ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే కేవలం 3 రోజులు మాత్రమే యాక్షన్ సీన్స్ చేసారు. ఆ తర్వాత అనుకున్నట్లుగానే యాక్షన్ సీన్స్ కంప్లీట్ అయ్యాయని , త్వరలో మరో షెడ్యూల్ ఉంటుందని నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.
అయితే ఫిలిం నగర్ లో వినబడుతున్న కథనం ప్రకారం యాక్షన్ సీన్స్ అనుకున్న విధంగా రాలేదని మహేష్ బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసాడట. దాంతో షూటింగ్ ఆపేయాల్సి వచ్చిందట. ముందుగా అనుకున్న దాని ప్రకారమైతే ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్ ఉందట. కానీ షూటింగ్ స్టార్ట్ చేసిన రోజు నుండే మహేష్ కు సంతృప్తి అనిపించలేదట.
దాంతో షూటింగ్ ఆపేసి పక్కాగా ప్లానింగ్ అయ్యాకే షూటింగ్ చేద్దామని చెప్పాడని టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు -త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇంతకుముందు అతడు , ఖలేజా రెండు చిత్రాలు వచ్చాయి. అయితే అతడు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేదు కానీ టీవీ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఖలేజా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. దాంతో ఈ మూడో చిత్రం తప్పకుండా హిట్ చేయాలన్న కసితో ఉన్నారట. మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలోనే విడుదల చేయాలనే తలంపుతో ఉన్నారు.