ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లపై ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. ఫలానా హీరో, ఫలానా డైరెక్టర్ కలయికలో సినిమాలు వస్తే బొమ్మ బ్లాక్ బాస్టరేనన్న మాటలు వినిపిస్తుంటాయి. అందుకే ఎన్నిసార్లు అయినా సరే ఎన్నళ్లయినా సరే.. అలాంటి కాంబినేషన్ల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. ప్రజెంట్ టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సీనియర్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో కోసం అలానే వెయిట్ చేస్తున్నారు. దీంతో చిన్న అప్డేట్ వచ్చినా.. పెద్ద సెన్సేషన్ గా మారుతోంది. ఈక్రమంలో ఈ మూవీ గురించి ఓ సెన్సేషన్ న్యూస్ వినిపిస్తోంది.
దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత SSMB28 తో వస్తుండటంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి. పైగా ఇప్పటికే అతడు, ఖలేజా మూవీలు ప్రేక్షకలు మనసు దోచుకున్నాయి. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ముచ్చటగా మూడోసారి జతకట్టబోతున్నారు. ఇటీవల కొన్ని అనివార్య కారణాలతో షూటింగ్ కు వాయిదా పడగా… రెండో షెడ్యూల్ జనవరి నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో కాకుండా కొత్తగా ట్రై చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
మాములుగా త్రివిక్రమ్ కు సెంటిమెంట్స్ ఎక్కువ. అందుకే తన సినిమాలన్నీ ఫ్యామిలీ ఎమోషన్సల్ చుట్టునే తిరుగుతుంటాయి. కానీ ఇప్పుడు దానికి రివర్స్ లో వెళ్తున్నాడు. గుంటూరు బ్యాక్ డ్రాప్ లో ఉన్న కథతో త్రివిక్రమ్ సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ బ్యాక్ డ్రాప్ లో రాజకీయాలు , పల్నాడు ఫ్యాక్షన్ గొడవలని టచ్ చేస్తూ కథని తెరకెక్కిస్తున్నాడట. పైగా విలేజ్ నేటివిటీ కోసం గుంటూరులో భారీ సెట్ కూడా వేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.