
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీపై టాలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్‌లో వున్న వీరిద్దరూ దాదాపు పుష్కర కాలం తర్వాత ఒకే సినిమా కోసం పనిచేస్తున్నారు. #SSMB28 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం సూపర్‌స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. త్వరలో టైటిల్ రిలీజ్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్ ను ఇచ్చారు మేకర్ప్. సినిమా టైటిల్ అనౌన్స్ చేయక ముందే రిలీజ్ డేట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అనౌన్స్ చేసి అదిరిపోయే మాస్ ట్రీట్ ఇచ్చారు.
2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్నాడు సూపర్ స్టార్. SSMB28 ఫస్ట్ లుక్ తో మహేష్ బాబు ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. పోస్టర్ ని బట్టి చూసే ఈ మూవీ గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రిలీజైన పోస్టర్ లో మిర్చి యార్డ్ లో జరిగే యాక్షన్ సన్నివేశమని అనిపిస్తోంది. మిర్చి యార్డ్ లో ఎవరికో బుద్ధిచెప్పి.. కళ్లద్దాలు, నోట్లో సిగరెట్ తో గుంటూరు మిర్చి ఘాటుని తలపిస్తూ స్టైల్ గా నడిచొస్తున్న మహేష్ బాబు మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. అలాగే వెనకాల లారీ, సైడ్ లో కారు, పైకి ఎర్రని మిర్చీ ఎగురుతుండగా టోటల్ గా ఫస్ట్ లుక్ మాస్ గా అదిరిపోయేలా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక సూపర్ స్టార్ కు జోడిగా పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్‌లో మెరువనుండగా.. శ్రీలీల మరదలుగా నటించనుంది. మహేష్ కు తాతగా ప్రకాశ్ రాజ్… విలన్ గా జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ సినిమా నైజాం రైట్స్ దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఇక నెట్ ఫ్లిక్స్ ఏకంగా 81 కోట్ల డీల్‌తో అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతికి మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి మాస్ బొమ్మ చూపించబోతున్నారని పోస్టర్ తోనే అర్థమవుతోంది.