39.9 C
India
Tuesday, April 21, 2026
More

    ఏంటీ అరాచకం..!

    Date:

    Malli Pelli Teaser
    Malli Pelli Teaser

    సీనియర్ నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేశ్ ప్రేమాయణం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి తన భర్త ప్రేమాయణం గురించి బహిరంగంగా ఆరోపణలు చేశారు. తనకు విడాకులు ఇవ్వకుండానే నరేష్ మరో పెళ్లికి సిద్ధపడ్డాడు అంటూ మీడియా ముందుకు వచ్చారు. ఈ వివాదం జరుగుతున్న క్రమంలో నరేష్ ఒక ఫొటోను సోషల్ మీడియాలో వదిలారు. ఆ ఫొటోలో పవిత్రా లోకేశ్‌కు నరేష్ లిప్ లాక్ ఇచ్చినట్టు ఉంది. ఇంకేముంది తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించేశారు అని అంతా అనుకున్నారు. ఆ తరవాత కొన్ని రోజులకు తమకు పెళ్లి జరిగిపోయిందంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూసిన కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఇది నిజం పెళ్లిలా లేదే అన్నారు. దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో మళ్ళీ పెళ్లి అంటూ పోస్టర్ వదిలారు.దీంతో నరేష్ ఎంత షాక్ ఇచ్చావ్ అని చాలా మంది నెటిజన్స్, సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

    ఇప్పుడు మళ్ళీ పెళ్లి టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు నరేష్. ఈ టీజర్ చూసిన తరవాత ప్రేక్షకులకు ఇంకా పెద్ద షాక్ తగిలింది. టీజర్ విషయానికి వస్తే.. ‘మళ్ళీ పెళ్లి’ అనేది రియల్ కాదు.. రీల్ స్టోరీ అనే అంతా అనుకున్నారు కానీ.. ఇది నరేష్ రియల్ స్టోరీనే .తన జీవితంలో జరిగిన, జరుగుతున్న సంఘటనలతో ఈ సినిమాని తెరకెక్కించినట్లుగా ఈ టీజర్ క్లారిటీ ఇచ్చేసింది. రమ్య రఘుపతితో గొడవలు.. ఆమె మీడియా ముందుకు వచ్చిన చేసిన ఆరోపణలు.. హోటల్‌లో నరేష్, పవిత్రా లోకేశ్ దొరికిపోవడం వంటి సన్నివేశాలతో టీజర్ కట్ చేశారు. బహుశా రమ్య రఘుపతిని టార్గెట్ చేస్తూ ఈ సినిమా కథ ఉండబోతోందేమో అంటున్నారంత.. టీజర్ చూసిన నెటిజన్స్ ఇదేం ట్విస్ట్ బాబోయ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

    మొత్తంగా మరోసారి నరేష్, పవిత్రల ప్రేమాయణాన్ని ఈ టీజర్ వార్తలలోకి తెచ్చిందనేది ఎంత వాస్తవమో..? టీజర్ తర్వాత సినిమా కోసం వెయిట్ చేసేలా చేసిందనేది కూడా అంతే వాస్తవం. డా.నరేష్ వికె పరిశ్రమలో 50 గోల్డెన్ ఇయర్స్‌ని పూర్తి చేసుకున్న సందర్భంగా.. గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌గా ఆయన నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికైతే.. ఈ టీజర్‌పై భారీ స్థాయిలో చర్చలు నడుస్తుండగా.. ఇప్పుడీ టీజర్‌పై రమ్య రఘుపతి ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఆశ్చర్యంగా మారింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Malli Pelli OTT : అమేజాన్ ప్రైమ్ లో ‘మళ్లీ పెళ్లి’.. సెన్సార్ లేకుండా..! ఎప్పుడంటే..?

    Malli Pelli OTT : జీవితంలోని కొన్ని ఘట్టాలు, మరికొంత ఫిక్షన్...

    Malli Palli In OTT : పవిత్ర, నరేష్ ల మళ్లీపెళ్లి ఓటీటీలో విడుదల

    Malli Palli In OTT : పవిత్ర లోకేష్, నరేష్ ప్రేమాయణం...

    Jigel Rani : అదో జిగేల్ రాణి.. నువ్వు లత్కోర్ గానివి.. నరేష్-పవిత్రలను బూతులు తిట్టిన నెటిజెన్..!

    Jigel Rani : విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి...

    Malli Pelli OTT : ఓటీటీలోకి ‘మళ్లీ పెళ్లి’.. ఎప్పుడంటే..

    Malli Pelli OTT : సీనియర్ హీరో నరేశ్ నటిస్తూ నిర్మించిన...