
సాలిడ్ అందాల భామ అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అరుంధతి. అనుష్క అంతకుముందు వరకు కూడా కేవలం గ్లామర్ పాత్రలను మాత్రమే పోషించింది. అందాల ఆరబోతతో ఎవరికీ తగ్గకుండా స్కిన్ షో చేసింది అనుష్క. అయితే అలాంటి అనుష్కకు అరుంధతి చిత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రమయ్యింది.
అయితే ఇలాంటి సినిమాను మొదట చేయమని ఏ హీరోయిన్ దగ్గరకు వెళ్లిందో తెలుసా …….. మమతా మోహన్ దాస్ . అవును మమతా మోహన్ దాస్ కు మొదట ఈ అవకాశం వచ్చిందట. అయితే ఆమె చేద్దామనే అనుకుందట. కానీ మమతా మోహన్ దాస్ మేనేజర్ మాత్రం శ్యామ్ ప్రసాద్ తో సినిమా అంటే చుక్కలే వద్దని చెప్పాడట. దాంతో రిజెక్ట్ చేసిందట మమతా మోహన్ దాస్.
ఈ విషయాన్ని ఇప్పుడు చెబుతోంది. అరుంధతి లో నాకు మొదట అవకాశం వచ్చింది. ఆ సినిమా చేయకుండా పెద్ద తప్పు చేసావని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తిట్టాడట కూడా. ఎందుకంటే ఆ సమయంలో అరుంధతి సినిమాతో పాటుగా రాజమౌళి దర్శకత్వంలో యమదొంగ సినిమా చేసే ఛాన్స్ కూడా వచ్చిందట. దాంతో యమదొంగ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
షూటింగ్ చేస్తున్న సమయంలో నాకు అరుంధతి ఛాన్స్ వచ్చింది నేను రిజెక్ట్ చేశాను అని రాజమౌళికి చెప్పిందట. దాంతో షాక్ అయిన రాజమౌళి పెద్ద తప్పు చేసావ్ …… అరుంధతి సినిమా చేయాల్సి ఉండే అంటూ తిట్టాడట. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయిందని బాధపడుతోంది మమతా మోహన్ దాస్. పాపం ఈ భామ క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకుంది. దాంతో కెరీర్ పరంగా వెనుకబడిపోయింది.