మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం మాన్ స్టర్. ఈ చిత్రంలో హనీ రోజ్ హీరోయిన్ గా నటించగా కీలక పాత్రలో మంచు లక్ష్మీ ప్రసన్న కూడా నటించింది. మంచు లక్ష్మీ ఈ చిత్రంలో నటించింది అని అనుకుంటే ……. ఫరవాలేదు ఓ మంచి పాత్రే చేసి ఉంటుందిలే అనుకుంటారు ఎవరైనా……. కానీ సినిమా చూస్తేనే అర్థమౌతుంది ఎలాంటి పాత్ర పోషించిందో అనేది. ఇంతకీ ఈ భామ పోషించిన పాత్ర ఎలా ఉందో తెలుసా ……. లెస్బియన్ పాత్ర. ఆ పాత్ర చూసి షాక్ అవ్వడం ఖాయం.
మాన్ స్టర్ చిత్ర కథ ఏంటంటే …… ఇద్దరు అనాధలైన అమ్మాయిలు హాస్టల్ లో పెరుగుతుంటారు. అయితే యుక్త వయసులోనే ఇద్దరు అమ్మాయిలు కూడా శృంగారంలో పాల్గొంటారు. సహజంగా ఆడ – మగ శృంగారంలో పాల్గొంటారు. కానీ ప్రకృతికి విరుద్ధంగా ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఇష్టపడి అలా బ్రతకడానికి డబ్బు కోసం ఎలాంటి హత్యలు చేశారు అన్నదే కథాంశం.
ఇందులో హానీ రోజ్ – మంచు లక్ష్మీ ఘాటు కౌగిలింతలతో అలాగే లిప్ లాక్ లతో రెచ్చిపోయారు. ఈ సీన్స్ చూసినప్పుడు ప్రేక్షకులకు కాస్త వెగటు పుట్టడం ఖాయం . అలా ఉన్నాయి మరి ఆ సన్నివేశాలు. దాంతో మంచు లక్ష్మీ ఇలాంటి పాత్రలో నటించడం ఏంటి ? అని షాక్ అవుతున్నారు. అయితే ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయడం నాకు ఇష్టమని అంటోంది…… అంతేకాదు ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని అంటోంది మంచు లక్ష్మీ ప్రసన్న