
మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కు మళ్ళీ పెళ్లి అవుతోంది. ప్రణతి రెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మంచు మనోజ్. అయితే కొన్నాళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి భూమా మౌనికతో ప్రేమలో పడ్డాడు. భూమా మౌనిక భూమా నాగిరెడ్డి – భూమా శోభా నాగిరెడ్డి దంపతుల చిన్న కుమార్తె.
భూమా మౌనికకు ఇంతకుముందే పెళ్లి అయ్యింది. అయితే ఆమె కూడా విడాకులు తీసుకుంది. అప్పటి నుండి సింగిల్ గానే ఉంటోంది. ఇటీవలే మంచు మనోజ్ తో మింగిల్ కావాలని డిసైడ్ అయ్యింది. అసలు ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే కొన్ని అవాంతరాలు రావడంతో మార్చి 3 న సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నారు.
కేవలం కొంతమంది సన్నిహితులు , కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరుగనుంది. మంచు మనోజ్ కు అలాగే భూమా మౌనికకు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. మంచు మనోజ్ హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయాడు. దాంతో హీరోగా కెరీర్ ఆశించిన స్థాయిలో లేకపోయింది. మార్చి 3 న మళ్ళీ పెళ్లి చేసుకుంటుండటంతో నూతన దంపతులకు శుభాకాంక్షలు అందజేస్తున్నారు పలువురు.