హీరో మంచు మనోజ్ కు కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రేమకు కేవలం నాలుగేళ్లు మాత్రమే అని అనుకుంటున్నారు అందరూ కానీ ఈ ఇద్దరి మధ్య ప్రేమకు ఎన్ని సంవత్సరాలో తెలుసా …… 12 సంవత్సరాలు.
అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! 12 ఏళ్ల కిందటే భూమా మౌనిక రెడ్డి ని ప్రేమించాడు మంచు మనోజ్. అయితే ఈ ప్రేమ విషయాన్ని చెప్పలేకపోయాడు. ఇక భూమా మౌనికను బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డి అనే వ్యక్తితో 2016 లోనే పెళ్లి అయ్యింది. వాళ్లకు ఒక బాబు కూడా. అయితే భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుండి మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ల ప్రేమ స్టార్ట్ అయ్యింది.
మంచు మనోజ్ కు కూడా అంతకుముందే పెళ్లి అయ్యింది. ప్రణతి రెడ్డితో కొన్నాళ్ల పాటు కాపురం సజావుగానే సాగింది. అయితే మంచు మనోజ్ కు అలాగే ప్రణతి రెడ్డి ల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. కట్ చేస్తే మార్చి 3 న పెళ్లి చేసుకున్నారు మనోజ్ – మౌనిక.
పెళ్లి కావడంతో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు కొత్త దంపతులు. అయితే వీళ్ళ కంటే మౌనిక రెడ్డి కొడుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎందుకంటే మౌనిక రెడ్డి కొడుకును తన సొంత కొడుకు లాగే చూసుకుంటానని మంచు మనోజ్ చెప్పడమే కాకుండా అతడ్ని ఎత్తుకొని ముద్దు చేస్తున్న తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇదే సమయంలో విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విమర్శలను పక్కన పెడితే ……కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మంచు మనోజ్ కూడా ఇదే మాట అంటున్నాడు. దాంతో సోషల్ మీడియాలో తెగ మీమ్స్ వచ్చి పడుతున్నాయి.