హీరో మంచు మనోజ్ – భూమా మౌనిక ల పెళ్లి ఎప్పుడు జరుగనుందో తెలుసా ……. 2023 ఫిబ్రవరి 2 న. అవును గతకొంత కాలంగా కలిసే ఉంటున్నారు మంచు మనోజ్ – భూమా మౌనిక. భూమా నాగిరెడ్డి – భూమా శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కూతురు భూమా మౌనిక అనే విషయం తెలిసిందే. ఆమెకు ఆల్రెడీ పెళ్లి అయ్యింది. ఒక కొడుకు కూడా. అయితే భర్తతో తీవ్ర విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది.
ఇక మంచు మనోజ్ కూడా ప్రణతి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మనోజ్ కు ప్రణతి రెడ్డికి విబేధాలు తలెత్తడంతో ఈ ఇద్దరు కూడా విడిపోయారు. ఇక అప్పటి నుండి భూమా మౌనిక – మంచు మనోజ్ కలిసి ఉంటున్నారు. విచిత్రం ఏంటంటే ……. భూమా మౌనిక పెళ్ళికి మంచు మనోజ్ వెళ్లి శుభాకాంక్షలు తెలపడం. కట్ చేస్తే ఇప్పుడు ఈ ఇద్దరూ 2023 ఫిబ్రవరి 2 న పెళ్లి చేసుకుంటున్నారు.
అయితే మంచు మనోజ్ – భూమా మౌనిక ల పెళ్ళికి ఇరు కుటుంబాల మద్దతు లేనట్లు తెలుస్తోంది. మరి పెళ్లి నాటికి ఇరు కుటుంబాల పెద్దలు కలుస్తారా ? లేదా ? అన్నది చూడాలి. పెళ్లి నిశ్చయం కావడంతో కడప లోని దర్గాను దర్శించుకున్నారు మనోజ్ – మౌనిక.