ఈరోజు మార్చి 3 న రాత్రి మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి ల వివాహం జరుగనుంది. అయితే ఈ పెళ్లి గురించి అందరికీ చెప్పడం లేదు . కేవలం కొంతమంది సన్నిహితులు , కుటుంబ సభ్యులకు మాత్రమే ఆహ్వానం అందించారు. ఎందుకంటే అటు మంచు మనోజ్ కు అలాగే ఇటు భూమా మౌనిక రెడ్డి లకు రెండో వివాహం.
గతంలో భూమా మౌనికకు పెళ్లి అయ్యింది. అయితే సంసార జీవితం సాఫిగా సాగలేదు దాంతో విడాకులు తీసుకుంది. కొంతకాలంగా ఒంటరిగానే ఉంటోంది. ఇక ఆ సమయంలోనే మంచు మనోజ్ తో మరింత స్నేహం పెరగడంతో ఒక్కటి కావాలని అనుకున్నారు. మంచు మనోజ్ కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
అయితే మంచు మనోజ్ సంసారం కూడా ఆశించిన స్థాయిలో సాగలేదు దాంతో భార్యాభర్తల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తాయి. విభేదాలతో సంసారం సాగించలేమని విడాకులు తీసుకున్నారు. భూమా మౌనిక రెడ్డి కి మంచు మనోజ్ కు ముందునుండే పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ఇలా రెండో పెళ్ళికి దారి తీసింది. మంచు మనోజ్ – భూమా మౌనిక పెళ్లి ఈరోజు రాత్రి 8. 30 నిమిషాలకు జరుగనుంది. నిన్న రాత్రి సంగీత్ వేడుక జరిగింది. ఆ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.