మంచు మనోజ్ రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. మోహన్ బాబు వారసుడు అయిన మంచు మనోజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. అయితే నటుడిగా మాత్రం అలరించాడు. ఇక ఇదే సమయంలో ప్రణతి రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆపెళ్ళి 2015 లో జరిగింది. అయితే 2019 లో విడాకులు తీసుకున్నారు. దాంతో అప్పటి నుండి సింగిల్ గానే ఉంటున్నాడు మంచు మనోజ్.
కట్ చేస్తే నిన్న భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డితో విఘ్నేశ్వరుడ్ని దర్శించుకున్నాడు. దాంతో హాట్ టాపిక్ గా మారింది. గతకొంత కాలంగా భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో ఉన్నాడట మంచు మనోజ్. ఇక త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఇక వినాయకుడిని దర్శించుకున్న సమయంలో భూమా మౌనిక రెడ్డితో రెండో పెళ్లి జరుగనుందా ? అని ప్రశ్నిస్తే దానికి ఓ మంచి రోజు చూసుకొని తప్పకుండా చెబుతాను అని అన్నాడు తప్ప ఖండించలేదు దాంతో మనోజ్ – మౌనిక ల పెళ్లి ఖాయమని తెలుస్తోంది.
భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. గతంలో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. దాంతో ఇద్దరికీ కుదిరినట్లుంది. త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన భూమా నాగిరెడ్డి – శోభా నాగిరెడ్డి ఇద్దరు కూడా మరణించిన సంగతి తెలిసిందే. వారి రెండో కుమార్తె ఈ మౌనిక రెడ్డి.