
ఈరోజు మంచు మనోజ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వీడియో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మనోజ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న సమయంలోనే హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో మంచి పార్టీ చేసుకున్నాడు మంచు మనోజ్. చికెన్ , రొయ్యలు , చేపలు , మటన్ ఇలా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలలో బ్రహ్మాండమైన విందు ఏర్పాటు చేసింది మంచు లక్ష్మి. కాగా ఆ విందుకు మంచు మనోజ్ తన భార్య భూమా మౌనికతో వెళ్ళాడు.
బయట మీడియాలో మంచు విష్ణు- మంచు మనోజ్ గొడవ పడ్డారని , చాలా కాలంగా ఇద్దరు అన్నా దమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని మొత్తంగా పెద్ద చర్చలు పెట్టారు పలు న్యూస్ ఛానల్స్ లలో. అయితే అంత గొడవ జరుగుతున్నా మంచు లక్ష్మి ఇంట్లో మాత్రం మంచు మనోజ్ విందు కార్యక్రమంలో పాల్గొనడం సంచలనంగా మారింది. ఇక ఈ విందుకు సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మి. దాంతో షాక్ అవ్వడం నెటిజన్ల వంతయ్యింది.