కేవలం కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మంచు మనోజ్ – భూమా మౌనిక ల పెళ్లి జరిగింది. హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో మంచు లక్ష్మీ నివాసంలో ఈ పెళ్లి జరిగింది. మార్చి 3 న రాత్రి 8. 30 నిమిషాలకు మౌనిక మేడలో తాళి కట్టాడు మంచు మనోజ్. ఈ పెళ్లి వేడుకకు వైఎస్ విజయమ్మ , టీజీ వెంకటేష్ , కోదండరామిరెడ్డి , పరుచూరి గోపాలకృష్ణ , దేవినేని అవినాష్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
తమ్ముడు మంచు మనోజ్ అంటే మంచు లక్ష్మీకి ఎనలేని ప్రేమ దాంతో తమ్ముడి పెళ్లిని తన ఇంట్లోనే చేసింది. ఫిలిం నగర్ లోని మోహన్ బాబు ఇంటిని మంచు లక్ష్మీకి ఇచ్చాడు మోహన్ బాబు. ఆస్థి పంపకాలలో ఈ ఇల్లు లక్ష్మీకి వచ్చింది. ఇక అప్పటి నుండి మంచు లక్ష్మీ ఇక్కడే ఉంటోంది. మంచు మనోజ్ వేరే చోట ఉంటున్నాడు. అయితే మొదటి భార్యతో విడాకులు కావడంతో రెండో పెళ్ళికి సిద్ధపడ్డాడు.
భూమా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో బెంగుళూర్ కు చెందిన వ్యాపారవేత్తతో పెళ్లి అయ్యింది. అయితే ఆ కాపురం మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. దాంతో విడాకులు తీసుకుంది. ఇక అప్పటి నుండి మంచు మనోజ్ – భూమా మౌనిక లు తరచుగా కలుసుకోవడంతో పరిచయం కాస్త పెళ్ళికి దారి తీసింది.