మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు , హీరో మంచు విష్ణు 18 యూట్యూబ్ ఛానళ్ల పై కేసు పెట్టాడు. ఈ విషయాన్ని మీడియాకు వివరించాడు మంచు విష్ణు. గతకొంత కాలంగా 18 యూట్యూబ్ చానళ్ళు అదేపనిగా నన్ను , నా కుటుంబ సభ్యులను అవమానిస్తున్నాయని అందుకే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసానని , ఇక ఓ స్టార్ హీరో పై కూడా పూర్తి వివరాలతో కేసు పెట్టబోతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మంచు విష్ణు.
జూబ్లీహిల్స్ లోని ఓ హీరో ఇంటి నుండే నాపై అలాగే నా కుటుంబంపై ట్రోల్స్ జరుగుతున్నాయని , అందుకు ఐపీ అడ్రస్ కూడా సేకరించామని , మిగతా వివరాలు కూడా తీసుకొని మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తానని స్పష్టం చేసాడు మంచు విష్ణు. ఇన్నాళ్లు సహించానని కానీ ఇకపై సహించేది లేదని , అలాగే జవాబుదారీ తనం కోసమే ఫిర్యాదు చేసానని అంటున్నాడు.
ఇక తాజాగా మంచు విష్ణు నటించిన చిత్రం ” జిన్నా ”. ఈ సినిమా అక్టోబర్ 21 న విడుదల కానుంది. అయితే అక్టోబర్ 5 న ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మంచు విష్ణు హీరోగా నటించగా పోర్న్ స్టార్ సన్నీ లియోన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తోంది. అలాగే హీరోయిన్ గా హాట్ భామ పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.