మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రం ” జిన్నా ”. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అక్టోబర్ 21 న విడుదల అవుతుండగా రెండు రోజుల ముందు నుండే జిన్నా బాగోలేదని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదేపనిగా ప్రచారం చేస్తున్నాయ్. దాంతో మండిపడ్డాడు మంచు విష్ణు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో అప్పుడే తన సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తుండటంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్నాడు మంచు విష్ణు. ఇక అలాంటి వాళ్లపై చర్యలు తీసుకోవడానికి సమాయత్తం అవుతున్నాడు. ఇప్పటికే నన్ను , నా కుటుంబాన్ని అదేపనిగా ట్రోల్ చేస్తున్నారని వాళ్ళ వెనుక ఓ పెద్ద హీరో ఉన్నాడని మంచు విష్ణు ఆరోపించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు జిన్నా సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకులు తేల్చనున్నారు.