మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళను’ మా ‘ నుండి శాశ్వతంగా తొలగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేసాడు ‘మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు. మాకు వ్యతిరేకంగా కానీ మా నిర్ణయాలను దిక్కరిస్తూ మీడియాకు ఎక్కినా సహించేది లేదన్నాడు. అలాంటి వాళ్ళను శాశ్వతంగా అసోసియేషన్ నుండి తొలగిస్తామని , ఇందులో ఎలాంటి రాజీ లేదని కుండబద్దలు కొట్టాడు మంచు విష్ణు.
తాను ఎన్నికై ఏడాది కాలం పూర్తి కావడంతో మీడియా సమావేశం నిర్వహించాడు. ఏడాది కాలంలో నేను ఇచ్చిన హామీలను 90 శాతం నెరవేర్చానని, ఇక ‘మా ‘ బిల్డింగ్ కోసం రెండు చోట్ల స్థలాలను చూశామని త్వరలోనే ఒకదాన్ని ఫైనల్ చేస్తామన్నాడు మంచు విష్ణు.
గత ఏడాది జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలకు తలపించిన విషయం తెలిసిందే. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు విజయం సాధించాడు. ఇక హీరోగా మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా. ఈనెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరి దాని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.