మెగా అభిమాని మరణించడంతో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్ర టీజర్ విడుదల వాయిదాపడింది. సంఘటన వివరాల్లోకి వెళితే ……. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ” విరూపాక్ష ”. సంయుక్త హీరోయిన్ గా నటించగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ – శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మించాయి.
ఈ సినిమా టీజర్ ను మార్చి 1 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. అయితే అనూహ్యంగా సాయిధరమ్ తేజ్ అభిమాని రావూరి పండు మరణించాడు. సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ ఈ పండు. దాంతో సాయి ధరమ్ తేజ్ తన అభిమాని మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. అంతేకాదు టీజర్ విడుదల వాయిదా వేయాల్సిందిగా దర్శక నిర్మాతలను కోరాడు. అందుకు దర్శక నిర్మాతలు కూడా అంగీకరించారు. దాంతో ఈరోజు విడుదల కావాల్సిన విరూపాక్ష టీజర్ వాయిదా పడింది. మరో రోజున టీజర్ ను విడుదల చేయనున్నారు.