నూతన దంపతులు నీలిమ – రవి ప్రఖ్యా లను ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవి దంపతులు. దర్శకుడు గుణశేఖర్ పెద్ద కూతురు నీలిమ పెళ్లి రవి ప్రఖ్యా తో అంగరంగ వైభవంగా జరిగింది. డిసెంబర్ 2 రాత్రి హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో పెళ్లి వేడుక జరుగగా ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖతో కలిసి వచ్చి ఆశీర్వదించారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి కొండా సురేఖ, అల్లు అరవింద్, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్ , సి . కళ్యాణ్ , బండ్ల గణేష్ , తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వి సుబ్బారెడ్డిలతో పాటుగా పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.