మెగాస్టార్ చిరంజీవి కి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ కు మధ్య విబేధాలు ఉన్నాయని గతకొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ వార్తలపై ఎట్టకేలకు స్పందించాడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. మెగాస్టార్ చిరంజీవితో నాలుగు నాలుగు దశాబ్దాల అనుబంధం ఉందని , మేమిద్దరం పేరుకు బావ – బావమరిదులం కానీ అంతకుమించిన స్నేహితులం అంటూ గాలివార్తలను కొట్టిపడేసాడు.
నేను చిరంజీవి తరచుగా కలుస్తూనే ఉంటాం. పండుగలలో కూడా తప్పనిసరిగా కలుస్తూనే ఉంటాం. మా ఇంటికి చిరంజీవి కుటుంబంతో సహా వస్తుంటాడు అలాగే మేము కూడా ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం. బయటి వాళ్ళు ఏదో అంటున్నారని ఈ విషయం చెప్పడం లేదు. అనుకునేవాళ్లు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. మాకు ఆ క్లారిటీ ఉంది చాలు అంటూ అలీతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు అల్లు అరవింద్.