
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా శంకర్ చిత్ర బృందం. ఇంతకీ ఆ శుభవార్త ఏంటో తెలుసా …… భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు అధికారికంగా. ఇంతకీ భోళా శంకర్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ……. 2023 ఆగస్టు 11 న. అవును ఆగస్టు 11 , 2023 న భోళా శంకర్ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుండగా మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి బాక్సాఫీస్ ను బద్దలుకొట్టింది.
దాంతో చిరంజీవి తదుపరి సినిమా ఈ భోళా శంకర్ కావడంతో దీనిపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందుతున్న చిత్రం కావడంతో తప్పకుండా ప్రేక్షకులను విశేషంగా అలరించడం ఖాయమని భావిస్తున్నారు. ఇక భోళా శంకర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో మెగాస్టార్ అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు.