
అమెరికన్ పాపులర్ షో అయిన ” గుడ్ మార్నింగ్ అమెరికా ” షోలో తనయుడు రాంచరణ్ పాల్గొన్నాడు దాంతో మెగాస్టార్ చిరంజీవి తెగ మురిసిపోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ఇంతగా ఎందుకు మురిసిపోతున్నాడో తెలుసా …….. గుడ్ మార్నింగ్ అమెరికా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన షో . అందులో హాలీవుడ్ స్టార్స్ కు మాత్రమే అవకాశం ఉంది.
ఇక మన ఇండియా తరుపున కేవలం షారుఖ్ ఖాన్ , ప్రియాంక చోప్రా లకు మాత్రమే అవకాశం లభించింది. ఇక ఇప్పుడేమో వాళ్ళ సరసన రాంచరణ్ కూడా చేరాడు. దాంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. అలాంటి పాపులర్ షోలో తన కొడుక్కు అవకాశం లభించడంతో తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
తాజాగా రాంచరణ్ అమెరికా పర్యటనలో ఉన్నాడు. మార్చి 12 న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. దాంతో 20 రోజుల ముందుగానే చరణ్ అమెరికా వెళ్ళాడు. ఇలా ఆర్ ఆర్ ఆర్ కోసం మరింతగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ దక్కడం ఖాయమని భావిస్తున్నారు. ఇక ఆ అవార్డు వస్తే మెగాస్టార్ చిరంజీవిని ఆపడం కష్టమే ! పుత్రోత్సాహంతో సంబరాలు చేసుకోవడం ఖాయం.