మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫిలిం క్రిటిక్ , సెన్సార్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు ఈ రివ్యూ ఇచ్చాడు. ఇంతకీ ఈ సినిమాకు ఇతగాడు ఇచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా ……. 2.5/5. అంతేకాదు మెగాస్టార్ పై దారుణమైన విమర్శలు కూడా చేసాడు. మీరు ఇక రెస్ట్ తీసుకోండి …… మీరు మెగాస్టార్ కావచ్చు కానీ కథల ఎంపికలో మీకు అంత తెలివి లేదు అంటూ దారుణమైన విమర్శలు చేసాడు.
ఈ విమర్శలు సాధారణంగా మెగా అభిమానులకు విపరీతమైన కోపం తెప్పిస్తాయి. తెప్పించాయి కూడా. అయితే ఇతడు యావరేజ్ సినిమా ంటే అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది…… సూపర్ హిట్ అంటే అట్టర్ ప్లాప్ అవుతుంది. ఎందుకంటే ఇతడు చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి కాబట్టి. చాలా సినిమాలకు బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చాడు అవి డిజాస్టర్ అయ్యాయి. బాగాలేవు అన్నవి మంచి హిట్ అయ్యాయి మరి.
ఉమైర్ సందు మీద చాలామందికి కోపం ఉంది. కానీ అతడు ఇచ్చే రివ్యూ కోసం మాత్రం ఎదురు చూస్తూనే ఉంటారు ఎందుకంటే అతడు ఇచ్చేదానికి భిన్నమైన రిజల్ట్ కనబడుతుంది కాబట్టి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సూపర్ హిట్టే అని డిసైడ్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. మలయాళంలో ఘనవిజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి , నయనతార , సల్మాన్ ఖాన్ , సునీల్ , సత్యదేవ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించాడు.