మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షోలు ఓవర్ సీస్ లో ముందే పడతాయి కాబట్టి టాక్ కూడా బయటకు వచ్చేసింది. ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులు వెంట వెంటనే తమ రివ్యూలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూనే ఉన్నారు.
ఇంతకీ ట్విట్టర్ రివ్యూ ప్రకారం గాడ్ ఫాదర్ ఎలా ఉందంటే …….. సూపర్ హిట్ అనాల్సిందే. కొంతమంది మిశ్రమ స్పందన కనబరుస్తున్నారు కానీ ఓవరాల్ గా ఎక్కువ మంది మాత్రం గాడ్ ఫాదర్ హిట్ అనే అంటున్నారు. ఇది మెగాస్టార్ అభిమానులకు నిజమైన పండగ రోజు అనే చెప్పాలి. ఒకవైపు దసరా పండగ మరోవైపు అభిమాన హీరో నటించిన సినిమా రిలీజ్ పండగ. దాంతో మెగా అభిమానులు చాలా ఖుషీగా ఉన్నారు.
మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో మార్పులు చేసి రీమేక్ చేసారు. దాంతో ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేసారు. అక్కడ కూడా మంచి హిట్ కావడం ఖాయమని భావిస్తున్నారు. టాక్ బాగానే ఉండటంతో భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అసలైన తీర్పు తెలుగు ప్రేక్షకులు తెలుగు రాష్ట్రాల్లో కొద్ది గంటల్లోనే ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి , నయనతార , సత్యదేవ్ , సునీల్ , తదితరులు నటించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు.