
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5 న దసరా కానుకగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటి రోజున 38 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో దాదాపు 21 కోట్ల షేర్ లభించింది మొదటి రోజున. ఫస్ట్ డే 40 కోట్లకు పైగా కలెక్ట్ చేయాల్సి ఉండే కానీ దసరా పండగ కావడంతో కాబోలు 38 కోట్ల గ్రాస్ వసూల్ అయ్యింది.
అయినా ఇది పెద్ద మొత్తమే అని చెప్పాలి. 38 కోట్ల గ్రాస్ తో 21 కోట్ల షేర్ లభించింది. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్లకు అమ్మారు. అంటే 92 కోట్ల షేర్ రావాలి. ఇదే జోరు కొనసాగితే తప్పకుండా బయ్యర్లను లాభాల్లోకి తీసుకురావడం ఖాయం. ఇక మెగాస్టార్ కు బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ నిచ్చే చిత్రమే లేదు. నిన్న గాడ్ ఫాదర్ చిత్రంతో నాగార్జున ది ఘోస్ట్ చిత్రం కూడా విడుదల అయ్యింది. అయితే దానికి ఆశించిన స్థాయిలో వసూళ్లు లేవు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ చిత్రాన్ని కొన్ని మార్పులతో తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మోహన్ లాల్ పోషించిన పాత్రను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసాడు. ఇక కీలక పాత్రల్లో నయనతార , సునీల్ , సత్యదేవ్ , సల్మాన్ ఖాన్ తదితరులు నటించారు. మోహన్ రాజా దర్శకత్వం వహించగా తమన్ సంగీతం అందించాడు.