మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమైనప్పటికీ ఆ రాజకీయాలు మాత్రం చిరంజీవిని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణే ఏపీసీసీ డెలిగేట్ గా మెగాస్టార్ ను గుర్తించడం. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించాడు. అయితే ఏపీ విభజన అనంతరం రాజకీయాలకు దూరమయ్యాడు. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు.
అయితే వచ్చే నెల అక్టోబర్ 17 న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. అందుకు పీసీసీ డెలిగేట్ లకు మాత్రం ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇక ఏపీ నుండి మెగాస్టార్ చిరంజీవికి కూడా ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ.ఏపీ లోని కొవ్వూరు డెలిగేట్ గా చిరంజీవిని గుర్తించింది. ఈనెల 24 నుండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ చేసే వాళ్ళు నామినేషన్లు వేయచ్చు. పార్టీ సీనియర్ నాయకుడైన అశోక్ గెహ్లాట్ , శశి థరూర్ లు పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఒప్పుకుంటే మిగతావాళ్ళు తప్పుకునే అవకాశం కూడా ఉంది.