దసరా బరిలో ఈసారి మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున పోటీ పడుతున్నారు. అక్టోబర్ 5 న మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ భారీ ఎత్తున విడుదల అవుతోంది. ఇక అదే రోజున నాగార్జున నటించిన ఘోస్ట్ కూడా రిలీజ్ అవుతోంది. దాంతో ఇద్దరి మధ్య భీకరపోరు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. గాడ్ ఫాదర్ చిత్రం మలయాళంలో సంచలన విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ కావడం విశేషం.
దాంతో చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున కు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఆ సినిమాకు కూడా భారీ ఓపెనింగ్స్ లభించడం ఖాయం. అయితే ఏ సినిమా బాగుంటే ఆ సినిమా దసరా బరిలో విజయం సాధిస్తుంది. ఇక దసరా కు మూడు , నాలుగు పెద్ద సినిమాలు విడుదలైన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ రెండు పెద్ద చిత్రాలు ఒకే రోజున వస్తే నష్టమేమి లేదు.
అయితే భారీ ఓపెనింగ్స్ అందుకోవడంలో చిరంజీవి ముందంజలో ఉంటాడు. ఇక సినిమా నచ్చితే బ్లాక్ బస్టర్ చేసి పెడతారు ప్రేక్షకులు లేదంటే ఆచార్య లాగా తిప్పి పంపిస్తారు. దసరా బరిలో విజయం సాధించేది ఎవరు ? అన్నది అక్టోబర్ 5 న తేలనుంది. చిరంజీవి – నాగార్జున ఇద్దరు కూడా మంచి మిత్రులు. అయితే సినిమాల పరంగా మాత్రం పోటీ తప్పడం లేదు మరి.