
రవితేజ హీరోగా నటించిన ధమాకా బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్ర దర్శకుడు నక్కిన త్రినాథరావు కు మెగాస్టార్ చిరంజీవి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నక్కిన త్రినాథరావు చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మెగాస్టార్. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత డివివి దానయ్య నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
డివివి దానయ్య నిర్మాతగా వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయం అని అనుకుంటున్నా తరుణంలో వెంకీ కుడుములకు మెగాస్టార్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వెంకీ స్థానంలో నక్కిన త్రినాథరావుతో సినిమా చేస్తేనే బెటర్ అని ఫిక్స్ అయ్యాడట ఎందుకంటే ఊర మాస్ సినిమా చేయడంలో నక్కిన ఘనాపాటి అని భావిస్తున్నాడట చిరు.
ధమాకా సినిమా రొటీన్ కథే …… అయినా యాక్షన్ , ఎంటర్ టైనర్ గా ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేసాడు. ఇక వాల్తేరు వీరయ్య అనే సినిమా కూడా పరమ రొటీన్ కథే అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. 220 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను 125 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. దాంతో నక్కిన త్రినాథరావుతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.






