36.5 C
India
Friday, April 10, 2026
More

    ‘బలగం’ ట్రూ ఫిల్మ్‌ వేణు చాలా గొప్పగా తీశాడు:  మెగాస్టార్ చిరంజీవి

    Date:

    Megastar chiranjeevi praises balagam movie
    Megastar chiranjeevi praises balagam movie

    మంచి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించిన‌ట్లు మ‌రెవ‌రూ ఆద‌రించ‌రు అని మ‌రోసారి రుజువు చేసిన చిత్రం ‘బలగం’. దిల్ రాజు సార‌థ్యంలో శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా క‌ళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెర‌కెక్కించారు. మార్చి 3న విడుద‌లైన చిత్రం సూప‌ర్ డూప‌ర్ స‌క్సెస్ టాక్‌తో ప్రేక్ష‌కుల ఆదరాభిమానాల‌ను పొందుతుంది. సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలోని పాత్ర‌లు, వాటి మ‌ధ్య భావోద్వేగాల‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు.  ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి ‘బలగం’ టీమ్‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఎంటైర్ బ‌ల‌గం టీమ్ చిరంజీవిని ప్ర‌త్యేకంగా క‌లిసింది. ఆయ‌న ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండికి శాలువా క‌ప్పి స‌న్మానించారు. 

    చిరంజీవి మాట్లాడుతూ ‘‘సినిమాను వేణు చాలా బాగా డైరెక్ట్ చేశాడు. బలగం నిజ‌మైన మూవీ. సినిమాలో నిజాయతీగా ఉంది. దిల్ రాజు వంటి క‌మ‌ర్షియ‌ల్ ప్రొడ్యూస‌ర్ ఉన్న‌ప్పటికీ వేణు సినిమాకు న్యాయం చేశాడు. ప‌క్కా నెటివిటీ ఉన్న సినిమా. తెలంగాణ సంస్కృతిని వేణు చ‌క్క‌గా చూపించాడు. త‌ను చిన్న‌ప్ప‌టి నుంచి చూసిన ప్ర‌తీ విష‌యాన్ని ఇందులో చూపించాడు వేణు. గ‌తంలో వేణు ఉగ్గు క‌థ‌లు, బుర్ర క‌థ‌లుపై ఓ జ‌బ‌ర్ద‌స్త్ షో చేసిన‌ప్పుడు నేను చూశాను. నిజంగా వేణులో ఇంత టాలెంట్ ఉందా అని వేణుపై గౌర‌వం పెరిగిపోయింది. ‘బలగం’ సినిమాతో త‌ను గొప్ప సినిమాను తీశాడనిపించింది’’ అన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chiranjeevi : గద్దర్ సినిమా అవార్డ్స్ పై చిరంజీవి సంచలన ప్రకటన

    Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2024పై అగ్ర కథానాయకుడు...

    Amaravati : అమరావతికి మెగాస్టార్ శోభ

    Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమం/పునఃప్రారంభోత్సవానికి...

    Singapore : పవన్ కుమారుడిని కాపాడిన కార్మికులను సన్మానించిన సింగపూర్ ప్రభుత్వం

    Singapore : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్...

    Chiranjeevi : పవన్‌ కుమారుడి గాయాలపై స్పందించిన చిరంజీవి

    Chiranjeevi : పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్ కుమారుడు మార్క్‌ శంకర్‌కు గాయాలైన...