
సూపర్ స్టార్ రజనీకాంత్ మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రాన్ని చూసాడు. గాడ్ ఫాదర్ చిత్రం రజనీకాంత్ కు బాగా నచ్చిందట. మలయాళంలో ఉన్న సన్నివేశాలను మార్చి తెలుగుకు మంచి మార్పులు చేసారని ….. సినిమా సూపర్ గా ఉందంటూ మెచ్చుకున్నాడట. ఈ విషయాన్ని దర్శకుడు మోహన్ రాజా వెల్లడించడం విశేషం.
మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రం లూసిఫర్ . మోహన్ లాల్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ కు అనుగుణంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు దర్శకుడు మోహన్ రాజా. రజనీకాంత్ మా చిత్రాన్ని చూసి మెచ్చుకోవడం సంతోషంగా ఉందంటున్నాడు మోహన్ రాజా.
దసరా కానుకగా అక్టోబర్ 5 న భారీ ఎత్తున విడుదలైన గాడ్ ఫాదర్ చిత్రం 110 కోట్ల వసూళ్లను సాధించింది. అయితే ఇది గ్రాస్ వసూళ్లు. ఈ సినిమా 91 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే 92 కోట్ల షేర్ రావాలి. కానీ ఇప్పటి వరకు 65 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. మరో 28 కోట్ల షేర్ రాబట్టాలి. మరి ఆ షేర్ రాబడుతుందా ? అన్నది ప్రశ్నగానే మిగిలింది.