మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ ను కుమ్మేస్తున్నాడు. జనవరి 13 న విడుదలైన వాల్తేరు వీరయ్య 10 రోజుల్లో దాదాపు 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో పలు బ్లాక్ బస్టర్ లు ఉన్నాయి అయితే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా వాల్తేరు వీరయ్య చిత్రం నిలిచింది. ఏకంగా 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో సునామీ సృష్టించింది.
ఊర మాస్ చిత్రంగా విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రానికి కొన్ని వెబ్ సైట్లు 2 , 2.25 అని తక్కువగా రేటింగ్ ఇచ్చాయి. అయితే ఆ రేటింగ్ చూసి చిరు కొంత బాధపడ్డాడట. అయినాసరే తప్పకుండా ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని మెగాస్టార్ గట్టిగా నమ్మాడట. ఎందుకంటే అన్నయ్య , ఘరానా మొగుడు , గ్యాంగ్ లీడర్ , రౌడీ అల్లుడు తదితర చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలో కూడా పక్కా ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చాం కాబట్టి బాక్స్ లు బద్దలు కావడం ఖాయమని ధీమాగా ఉన్నాడట …… అంతేకాదు రిలీజ్ కు ముందు ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించాడు కూడా.
కట్ చేస్తే అదే నిజం అయ్యింది. దాంతో కొంతమంది వెబ్ సైట్ వాళ్ళు తక్కువ రేటింగ్ ఇచ్చారని , అయితే అది నిజమే ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మిలియన్ డాలర్లు అంటూ చమత్కరించాడు. ఓవర్ సీస్ లో వాల్తేరు వీరయ్య 2.25 మిలియన్ డాలర్లను వసూల్ చేయడంతో దానికి అన్వహించుకున్నాడు మెగాస్టార్. అందుకే తక్కువ రేటింగ్ ఇచ్చిన వాళ్ళను మెచ్చుకుంటున్నాడు. మొత్తానికి వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురిపిస్తుండటంతో తప్పకుండా మరో 20 కోట్లకు పైగానే వసూళ్లు సాధించేలా కనబడుతోంది.