చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. జబర్దస్త్ కమెడియన్ మూర్తి ఈరోజు మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు మూర్తి. క్యాన్సర్ తో బాధపడుతున్న మూర్తి చికిత్స కోసం ఏకంగా 16 లక్షలు ఖర్చు చేసారు. కొంతమంది సినీ ప్రముఖులు కూడా కొంత విరాళాలు ఇచ్చారు.
అయితే క్యాన్సర్ తీవ్రత ఎక్కువ కావడంతో ఈరోజు ( సెప్టెంబర్ 27, 2022) న మరణించారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు వెల్లడించారు. మూర్తి మంచి మిమిక్రి ఆర్టిస్ట్ కూడా పలు వేదికలపై మిమిక్రీతో అలరించారు. అంతేకాదు జెమిని ఛానల్ లో కొన్నాళ్ల పాటు యాంకర్ గా కూడా చేసారు.
ఆ తర్వాత జబర్దస్త్ షోకు వచ్చారు. జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు …… ప్రేక్షకులను అలరించారు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా చిన్న చిన్న వేషాలు వేశారు. మిమిక్రీ మూర్తి మరణవార్త తెలిసిన పలువురు జబర్దస్త్ కమెడియన్లు మూర్తి మరణం పట్ల తీవ్ర విచారం వెలిబుచ్చారు.