తెలంగాణ ఐటీ , మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ హిట్ 2 చిత్రాన్ని చూసాడు. అడవి శేష్ హీరోగా నటించిన హిట్ 2 చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మించగా డాక్టర్ శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరి , కోమలి ప్రసాద్ లు హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ చిత్ర బృందం చాలా సంతోషంగా ఉన్నారు.
ఇక రాజకీయ కార్యకలాపాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ …….. వీలుచూసుకొని నిన్న రాత్రి హిట్ 2 చిత్రాన్ని చూసాడు. హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో హిట్ 2 చిత్రాన్ని చూసాడు. సినిమా కేటీఆర్ కు నచ్చడంతో హీరో అడవి శేష్ పై అలాగే దర్శక నిర్మాతలు నాని , శైలేష్ కొలను పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఎంతో బిజీగా ఉండే మంత్రి కేటీఆర్ తమ సినిమాను చూడటానికి రావడం , తమని అభినందించడంతో హిట్ 2 యూనిట్ చాలా చాలా సంతోషంగా ఉంది.
హిట్ చిత్రం సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా హిట్ 2 చిత్రం చేసారు. ఇక హిట్ 2 కూడా బ్లాక్ బస్టర్ కావడంతో హిట్ 3 చిత్రాన్ని కూడా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక హిట్ 3 లో హీరోగా నాని నటించనున్నాడు. ఇక ఈ మూడో చిత్రానికి కూడా డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్నాడు.