
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ మోహన్ బాబు అనే విషయం తెలిసిందే. ఏ సినిమా ఫంక్షన్ అయినా సరే ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం …… ఘాటు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. తాజాగా అదే పంథా కొనసాగించాడు విలక్షణ నటుడు మోహన్ బాబు. తిరుపతిలో విశాల్ నటించిన ” లాఠీ ” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా ఆ వేడుకలో కూడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు.
కొంతమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ లు , ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని , కళ్ళ ముందు అన్యాయం కనిపిస్తున్నా ఆ అన్యాయాన్ని ఎదిరించలేక అలాగే ప్రభుత్వాధినేతలకు చెప్పలేకపోతున్నారని ……. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన వాళ్ళు చేతకాని వాళ్లల ఉండిపోతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు మోహన్ బాబు.
ఇక పనిలో పనిగా హీరో విశాల్ ను కూడా ఏసుకున్నాడు. హీరో విశాల్ మంచివాడే కానీ అతడికి పొగరు ఎక్కువ. మనిషికి పొగరు ఉండాలి కానీ అది ఎదుటివాళ్లకు హాని చేసేలా ఉండకూడదని వ్యాఖ్యానించాడు. దాంతో షాకవ్వడం విశాల్ వంతు అయ్యింది. గతకొంత కాలంగా ఏపీలో జగన్ ప్రభుత్వం పై ఆగ్రహంగా ఉన్నాడట మోహన్ బాబు. అడపా దడపా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ తన కోపాన్ని చల్లార్చుకుంటున్నాడు. అన్నట్లు …….. మోహన్ బాబుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దగ్గరి బంధువేసుమా !