
Mrinal Thakur Bikini : సీతారామం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ సినిమాలో ఈమె చేసిన సీత రోల్ తో ప్రతీ ఒక్కరిని ఆకట్టు కుంది. ముఖ్యంగా అమ్మాయిలు అంటే ఇలా ఉండాలి అని అబ్బాయిలు ఫీల్ అయ్యేలా చేసి యూత్ ను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యింది.
చేసిన ఫస్ట్ సినిమాతోనే మంచి ఇంప్రెషన్ అందుకున్న మృణాల్ ను ప్రేక్షకులు మదిలో భద్రంగా భద్రపరుచు కున్నారు. ఒక్క సినిమా తోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్థానం సంపాదించుకుని వరుస అవకాశాలను కూడా అందుకుంటుంది.. ఇక ఈ బ్యూటీ ప్రజెంట్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదు..
నెట్టింట ఈమె క్రేజ్ భారీగా పెరిగింది అనే చెప్పాలి.. సీతారామం తర్వాతనే ఈ బ్యూటీ క్రేజ్ పెరిగింది.. ఈమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మృణాల్ కూడా గ్లామరస్ విందు అందిస్తుంది.. దీంతో యువత మొత్తం ఈ అమ్మడిని ఫాలో అవ్వడంతో బిజీ అయ్యారు.
తాజాగా మృణాల్ బికినీ ట్రీట్ ఇచ్చింది.. హాట్ సమ్మర్ లో ఈ అమ్మడి బికినీ అందాలు మరింత వేడెక్కిస్తున్నాయి. ఇన్నాళ్లు ఈమెను ట్రెడిషనల్ గానే ఊహించుకున్న ఫ్యాన్స్ కు ఇప్పుడు ఈమె గ్లామర్ గా కూడా కనిపిస్తాను అని హింట్ ఇచ్చేసింది.. దీంతో ఈ అమ్మడు బీచ్ లో దిగిన బికినీ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఇక ప్రజెంట్ ఈమె తెలుగులో నాని సరసన ఒక సినిమాలో చేస్తుంది..