
నేను పెళ్లి చేసుకోను కానీ పిల్లల్ని మాత్రం కంటాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఇటీవలే విడుదలైన సీతారామం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది ఈ భామ. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో జాతీయ మీడియాతో మాట్లాడింది. ఆ సందర్బంగా పెళ్లి చేసుకోను …… కానీ నాకు పిల్లలంటే చాలా చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకోకుండానే టెస్ట్ ట్యూబ్ ద్వారా పిల్లలను కంటాను అంటూ ప్రకటించింది.
నన్ను నన్నుగా ఇష్టపడేవాడు ఇప్పటి వరకు దొరకలేదు. ఇక ముందు కూడా దొరుకుతాడు అనే నమ్మకం లేదు. ఒకవేళ అలాంటి వాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. కాకపోతే అంత నమ్మకం లేదు. అందుకే పిల్లలు కావాలని అనుకున్నప్పుడు మాత్రం టెస్ట్ ట్యూబ్ బేబీ లను కనడానికి నేను సిద్ధం. ఈ విషయం మా అమ్మకు కూడా చెప్పాను. ఆమె కూడా ఒప్పుకుంది అంటూ మరింత సంచలన వ్యాఖ్యలు చేసింది మృణాల్ ఠాకూర్.
దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ” సీతారామం ”. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట సంచలన విజయం సాధించింది. అండర్ డాగ్ గా వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లను కొల్లగొట్టింది. దాంతో మృణాల్ ఠాకూర్ ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. ఇంకేముంది హిట్ కొట్టడంతో ఈ భామకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.