దిగ్గజ సంగీత దర్శకులు కోటి జ్ఞాన సరస్వతి అవార్డ్ అందుకున్నారు. 80- 90 వ దశకంలో బ్లాక్ బస్టర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రాజ్ – కోటి. తెలుగులో స్టార్ హీరోలందరి చిత్రాలకు సంగీతం అందించారు. సంగీత ద్వయం అయిన రాజ్ – కోటి లలో అగ్రస్థానం కోటి దే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సింహం సింగిల్ గా వస్తుంది అన్నట్లుగా రాజ్ నుండి విడిపోయిన తరువాత కూడా అద్భుతమైన పాటలకు సంగీతం అందించారు కోటి. పాతికేళ్ల క్రితమే పాశ్చాత్య మ్యూజిక్ అంటే ఏంటో రుచి చూపించారు కోటి.
తాజాగా జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారంతో ఏపీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి కోటిని సత్కరించారు. దాంతో కోటిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో JSW & Jaiswaraajya యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు దిగ్గజ సంగీత దర్శకులు కోటి.
ఆ సందర్భంగా తనకు లభించిన అవకాశాలను, పొందిన పురస్కారాలను గుర్తు చేసుకున్నారు. ఇటీవల మరణించిన రెబల్ స్టార్ కృష్ణంరాజుతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలాగే UBlood App సృష్టికర్త జై యలమంచిలిని అభినందించారు. యు బ్లడ్ యాప్ తప్పనిసరిగా ప్రతీ ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా విశేష పేరు ప్రఖ్యాతులు కలిగిన సోనూ సూద్ యు బ్లడ్ యాప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం సంతోషించతగ్గ పరిణామమన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి పూర్తి ఇంటర్వ్యూ JSW & Jaiswaraajya యూట్యూబ్ ఛానల్ లలో దసరా కానుకగా ప్రసారం కానున్నాయి. జ్ఞాన సరస్వతి విశిష్ట పురస్కారం అందుకున్న కోటిని సన్మానించింది JSW & Jaiswaraajya కమ్యూనికేషన్ మేనేజర్ చిలువేరు శంకర్ మరియు ప్రతినిధి బృందం. పూర్తి ఇంటర్వ్యూని దసరా రోజున వీక్షించండి.