అఖండ చిత్రం లాగే వీరసింహా రెడ్డి చిత్రంలో నేపథ్య సంగీతంతో బాక్స్ లు బద్దలు కానున్నాయని అంటున్నాడు సంగీత దర్శకుడు తమన్. అఖండ చిత్రానికి తమన్ అందించిన రీ రికార్డింగ్ తో చాలా చోట్ల బాక్స్ లు బద్దలైన విషయం తెలిసిందే. అఖండ సినిమా సంచలనం సృష్టించింది. కట్ చేస్తే వీరసింహా రెడ్డి చిత్రం కూడా అదే రిపీట్ చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు.
బాలయ్య ను చూస్తేనే బాక్స్ లు బద్దలయ్యేట్లు వాయించాలనిపిస్తుంది. ఇక సినిమా కథ డిమాండ్ చేస్తే చెప్పతరమా ! వీరసింహా రెడ్డి చిత్రాన్ని గోపీచంద్ మలినేని అద్భుతంగా తీసాడు దాంతో ఆ ఎమోషన్స్ కు తగ్గట్లుగా రీ రికార్డింగ్ ఇచ్చానని , దీనికి కూడా బాక్స్ లు బద్దలు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాడు తమన్.
వీరసింహా రెడ్డి చిత్రంలో యాక్షన్ తో పాటుగా అద్భుతమైన పాటలు , సిస్టర్ సెంటిమెంట్ ఇలా అన్నీ సమపాళ్లలో కలిశాయని , ప్రేక్షకులు సీట్ల లోంచి కదలలేని పరిస్థితి వస్తుందని , ఈలలతో , గోలలతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని అంటున్నాడు తమన్. ఇక పనిలో పనిగా వీరసింహా రెడ్డి చిత్రంతో పాటుగా చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రం కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు తమన్.