
ఆస్కార్ అవార్డు నాటు నాటు సాంగ్ గెలుచుకుంది అని ప్రకటించడమే ఆలస్యం …… ఎన్టీఆర్ , చరణ్ లు ఆ సంతోషాన్ని పట్టలేకపోయారు. తీవ్ర ఉద్వేగంతో అరుపులు అరుస్తూ గట్టిగా కౌగిలించుకున్నారు. ఎగిరి గంతేశారు ….. ఇక వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎంతగా చెప్పినా తక్కువే అని చెప్పాలి అంతగా సంతోషం వ్యక్తం చేసారు ఎన్టీఆర్ , చరణ్ లు.
మనం గెలిచాం ….. ఇండియన్ సినిమా గెలిచింది ….. భారతదేశం గెలిచింది …… ఆస్కార్ ను ఇంటికి తెస్తున్నాం అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో ఆస్కార్ సాధించడంతో యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ ఉప్పొంగి పోతోంది. అలాగే ఇండియన్ సినిమా కూడా గర్విస్తోంది. భారతీయ సినిమాకు ఆస్కార్ దక్కడంతో దేశ ప్రధాని మోడీ మొదలు పలువురు కేంద్ర మంత్రులు , వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు , మంత్రులు , ప్రజా ప్రతినిధులు , పలువురు స్టార్ హీరోలు , దర్శక నిర్మాతలు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.