
స్టార్ హీరోయిన్ నభా నటేష్ భారీ ప్రమాదం నుండి బయటపడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా చెప్పింది. గత ఏడాది భారీ ప్రమాదం జరిగిందని , ఆ ప్రమాదంలో వెంట్రుకవాసిలో భారీ ప్రమాదం తప్పిందని , అయితే చేయికి బలమైన గాయం కావడంతో శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని …… ఆపరేషన్ వల్ల బయటకు రాలేక కొన్నాళ్ళు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.
ఇక ఇప్పుడు కోలుకున్నానని , అయితే తగిన వ్యాయామం చేసి మళ్ళీ సినిమాల మీద దృష్టి పెడతానని అంటోంది. అయితే ఈ విషయం ఆలస్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే …… ప్రమాదం జరిగింది అంటే ముందు సానుభూతి వ్యక్తం చేస్తారు కానీ తీరా సమయానికి సినిమాలు ఇవ్వరు కాబట్టి పూర్తిగా కోలుకున్నాక చెబుతోంది అన్నమాట.
నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో భారీ హిట్ కొట్టింది. అంతకు ముందు అలాగే ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దాంతో కెరీర్ లో ఆశించిన స్థాయిలో స్టార్ డం పొందలేకపోయింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతోంది కాబట్టి తప్పకుండా మంచి జరగాలనే కోరుకుందాం. అయితే తనకు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆలస్యంగా చెప్పడంతో పలువురు షాక్ అవుతున్నారు.