నడిరోడ్డు మీద ఓ అమ్మాయిని ఓ అబ్బాయి కొట్టడంతో తనకు ఏమి పట్టనట్లుగా పోకుండా వెంటనే కారును ఆపి ఆ యువకుడి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావ్ ? అంటూ నిలదీసాడు హీరో నాగశౌర్య. ఈ సంఘటన ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. ప్రతీ రోజు అమ్మాయిల మీద అబ్బాయిలు దాడులు చేస్తున్న సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి.
అయితే చాలా సంఘటనల్లో మాత్రం అమ్మాయిలపై దాడులు జరుగుతున్నప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహారించే వాళ్ళు కోకొల్లలుగా తయారయ్యారు. అయితే హీరో నాగశౌర్య మాత్రం తన దారిలో తాను పోతుంటే నడిరోడ్డు మీద ఓ అబ్బాయి ఒక అమ్మాయిని కొట్టిన సంఘటన తన కళ్ళకు కనిపించగానే ఆలస్యం చేయకుండా కారు ఆపేసి ఆ యువకుడి దగ్గరకు వెళ్లి అమ్మాయిని కొట్టడం తప్పు ….. ఆమెకు సారీ చెప్పు అంటూ నిలదీసాడు.
మేమిద్దరం ప్రేమికులం …… నా ఇష్టం కొట్టుకుంటాను …. ఏమైనా చేసుకుంటాను అంటూ ఆ యువకుడు గట్టిగా చెప్పడంతో షాక్ అయిన నాగశౌర్య ఆ యువకుడ్ని పట్టుకొని గట్టిగా నిలదీసాడు. లవరా ….. కాదా అన్నది పక్కన పెట్టు కొట్టడం మాత్రం తప్పు వెంటనే సారీ చెప్పు అని పట్టుబట్టాడు దాంతో ఆ యువకుడు సారీ చెప్పక తప్పలేదు. హీరో నాగశౌర్య ప్రదర్శించిన ధైర్య సాహసాలు చూసి నిజంగానే హీరో అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.