పవన్ కళ్యాణ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 1000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారని అందుకే తెలంగాణలో కూడా జనసేన పోటీ చేయనుందని రకరకాల పుకార్లు షికారు చేస్తుండటంతో మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. 1000 కోట్ల ప్యాకేజ్ ఏంట్రా ? ప్రజల కోసం ….. 25 సంవత్సరాల పాటు పోరాటం చేయడానికి ముందుకు వచ్చాడు నా తమ్ముడు ….. అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.
జనసేన పార్టీని 2014 లో పవన్ కళ్యాణ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేయలేదు ….. అలాగే జనసేన తరుపున కూడా ఎవరినీ బరిలో నిలపలేదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం జనసేన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీ , పార్లమెంట్ స్థానాలకు పోటీ చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచాడు. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయాడు.
దాంతో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ ను ప్యాకేజ్ స్టార్ అని పిలుస్తూనే ఉన్నారు ……. అవమానిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అనే జాతీయ పార్టీ పెట్టడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేనకు కాస్త అభిమానుల బలం ఉంది కాబట్టి జనసేన పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్త చీలుతుంది కాబట్టి మనకు ప్రయోజనమని భావించారట. అందుకే 1000 కోట్ల ప్యాకేజ్ ముట్టిందని వైసీపీ శ్రేణులు అలాగే ఇతరులు విమర్శలు గుప్పిస్తున్నారు సోషల్ మీడియాలో. దాంతో నాగబాబు నిగ్రహించుకోలేకపోతున్నాడు. నా తమ్ముడు ప్రజల కోసం వస్తే ….. ప్రజాసేవ కోసం పరితపిస్తుంటే ప్యాకేజ్ స్టార్ అంటారా ? అంటూ మండిపడుతున్నాడు.