మెగా బ్రదర్ నాగబాబు చేతికి గాయమైంది. దాంతో నాగబాబుకు ఏమైంది అనే ప్రశ్న తలెత్తింది. ఇక మెగా అభిమానులకు బాగా దగ్గరైన నాగబాబు చేతికి గాయం కావడంతో అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ గాయం ఎప్పుడు జరిగింది ? ఎలా జరిగింది ? అన్నది పూర్తి వివరాలు తెలియలేదు కానీ తండ్రికి గాయం కావడంతో అతడ్ని బాగానే ఆటపట్టించింది నిహారిక.
కుడిచేయికి గాయం కావడంతో సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. దాంతో ఆ చేతికి పట్టీ కట్టుకున్నాడు. ఇక ఎడమ చేయిని గట్టిగా కొరికి నీ నొప్పి నయం చేస్తానని ఆటపట్టించింది……. దాంతో గట్టిగా అరిచాడు నాగబాబు. ఇదంతా ఓ వీడియో చేసి దాన్ని సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది అది కాస్త వైరల్ గా మారింది.