హైదరాబాద్ లోని బేగంపేటలో గల హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వందేళ్ల చరిత్ర కలిగింది. 1923 లో బేగంపేట లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ను కట్టించారు. నిజాం ప్రభుత్వం ఈ పాఠశాలను కట్టించారు. కట్ చేస్తే ఇప్పుడు 2023 అంటే ఈ పాఠశాల కట్టించి 100 సంవత్సరాలు అవుతోంది. దాంతో శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో కింగ్ నాగార్జున హాజరయ్యాడు.
ఈ పాఠశాలలో నాగార్జున చదువుకున్నాడు. 1976 లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న నాగార్జున ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నాడు. ఇక అప్పట్లో చదువుకుంటున్న సమయంలో చాలా చిలిపి పనులు చేసాడట. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా వెల్లడించడం విశేషం.
బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కనే మా ఇల్లు ఉండేది కాబట్టి నేను ఒక్కోసారి నడుచుకుంటూ వచ్చేవాడిని , అలాగే కొన్నిసార్లు సైకిల్ మీద వచ్చేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ప్రస్తుతం నాగార్జున ఏ సినిమాలో కూడా నటించడం లేదు. ఇటీవల నాగార్జున నటించిన కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో కొంత గ్యాప్ తీసుకున్నాడు.