కింగ్ నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ చిత్రం ” ది ఘోస్ట్ ”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. నాగార్జున ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. శివ చిత్రంలో సైకిల్ చైన్ పట్టాను ……. ఈ సినిమాలో కత్తులు పట్టాను అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు.
90 వ దశకంలో శివ సినిమా ట్రెండ్ క్రియేట్ చేసింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. అయితే ఆ సినిమాతో ది ఘోస్ట్ చిత్రాన్ని పోల్చడం సరికాదు కానీ ఈ సినిమాలో యాక్షన్ తో అదరగొట్టాను అని అన్నాడు నాగార్జున. ఇక ఆ మాటల సంగతి పక్కన పెడితే ప్రేక్షకులు ది ఘోస్ట్ చిత్రాన్ని చూసి నాగ్ చెప్పింది నిజమే ! అని అంటున్నారు.
ది ఘోస్ట్ చిత్రంలో యాక్షన్ సీన్స్ అదిరిపోయే రేంజ్ లో ఉన్నాయట. నాగార్జున మాస్ చిత్రాలు చేసాడు కానీ ఎక్కువగా క్లాస్ హీరోగానే ఇమేజ్ వచ్చింది. మరోసారి మాస్ అంటే ఏంటో చూపించాడని అంటున్నారు ప్రేక్షకులు. అయితే ఇదే సమయంలో ఆశించిన స్థాయిలో సినిమా ఏమి లేదని పెదవి విరిచే వాళ్ళు కూడా ఉన్నారు.