కింగ్ నాగార్జున నటించిన తాజా చిత్రం ” ది ఘోస్ట్ ”. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈనేపథ్యంలో ట్రైలర్ ని విడుదల చేసారు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రిలీజ్ చేసాడు. దాంతో వెంటనే వైరల్ గా మారింది.
ఇక ఈ ట్రైలర్ కంప్లీట్ గా యాక్షన్ మోడ్ లో ఉంది. ఇప్పటి వరకు నాగార్జున పూర్తిగా యాక్షన్ మోడ్ లో చేసిన చిత్రాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇక అందులో ఇది మొదటి స్థానంలో నిలిచేలా కనబడుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్లు కనబడుతోంది. నాగార్జున యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్ , పుష్కర్ రామ్మోహన్ రావు , శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 న దసరా కానుకగా విడుదల చేయనున్నారు. ఇక ఇదే రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం కూడా విడుదల కానుంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర తీవ్రమైన పోటీ నెలకొనడం ఖాయం.
Breaking News