
నటసింహం నందమూరి బాలకృష్ణ గత ఏడాది నటించిన చిత్రం చిత్రం అఖండ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021 డిసెంబర్ లో విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. హిందూధర్మం గురించి , శివతత్వం గురించి గొప్పగా చెప్పిన చెప్పిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది.
అలాగే బాలయ్య ద్విపాత్రాభినయం అదరహో అనిపించాడు. ముఖ్యంగా అఘోరా పాత్రలో బాలయ్య నటవిశ్వరూపం చూపించారు. బాలయ్య నటనకు థియేటర్లు దద్దరిల్లాయి. అయితే ఇంతటి సంచలనం సృష్టించిన అఖండ చిత్రానికి మాత్రం అవార్డులు ఇవ్వలేకపోయాయి. గంపగుత్తగా అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రానికి అవార్డుల వరద పారింది.
పుష్ప చిత్రానికి అవార్డులు ఇవ్వడంలో తప్పులేదు కానీ గంపగుత్తగా ఇవ్వడం మాత్రం అందునా అఖండ లాంటి చిత్రాన్ని పక్కన పెట్టి ఇవ్వడం మాత్రం సరైన చర్య కాదని నందమూరి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. సైమా కానివ్వండి , ఫిలిం ఫేర్ కానివ్వండి అఖండ చిత్రంలోని బాలయ్య నటనకు ఉత్తమ నటుడు అవార్డు తప్పకుండా ఇవ్వాలి కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రయారిటీ చూసుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.